ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- January 12, 2026
ఖసాబ్: ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రిని ఒమన్ సుల్తాన్ సతీమణి, హానరబుల్ లేడీ సయ్యిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆధునాతన వైద్య పరికరాలను పరిశీలించారు. ముసందమ్ గవర్నరేట్‌లోని పౌరులు మరియు నివాసితులకు అధునాతన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ముసందమ్ గవర్నరేట్‌కు చెందిన జానపద కళా బృందాలు వివిధ సాంప్రదాయ ఒమానీ వారసత్వ కళలను ప్రదర్శించారు. స్వాగత కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్ సబ్తి, ముసందమ్ గవర్నర్ సయ్యిద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది, విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా అహ్మద్ అల్ షైబానీ, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







