చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం..

- May 18, 2025 , by Maagulf
చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైద‌రాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వరకు ఈ దుర్ఘటనలో 17మంది మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో 30మంది ఉండటంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది.

అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా స్పందించారు. తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం తీవ్ర వేదనకు గురిచేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిని వారికి రూ.50వేలును అందిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com