తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం

- May 18, 2025 , by Maagulf
తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం

హైదరాబాద్: హార్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు లను విడి విడిగా కలిశారు.ముందుగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని దత్తాత్రేయ సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు.

అనంతరం వెలగపూడి వెళ్లిన దత్తాత్రేయ అక్కడ సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిశారు. జూన్ 8న హైదరాబాద్ లో జరిగే పుస్తకావిష్కరణకు రావలసింది గా కోరారు.

సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు.ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో ‘జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా’ పేరుతో విడుదలైంది.ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దీనిని తీసుకువస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com