శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం
- May 19, 2025
--రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత
తిరుమల: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు.
ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు.సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం.
ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు.
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







