తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సూర్య‌..

- May 19, 2025 , by Maagulf
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సూర్య‌..

త‌మిళ న‌టుడు సూర్య ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. తెలుగు నాట ఆయ‌న‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లుగా ఆయ‌న త‌మిళంలో చేసిన చిత్రాలు తెలుగులోనూ విడుద‌ల అవుతుండ‌గా.. ఇక ఇప్పుడు ఆయ‌న‌ నేరుగా తెలుగులోనే ఓ చిత్రాన్ని చేస్తున్నారు.

ల‌క్కీ భాస్క‌ర్‌తో విజ‌యాన్ని అందుకున్న వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. సూర్య కెరీర్‌లో 46వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో వేడుక‌గా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో సూర్య‌, వెంకీ అట్లూరి, మిగిలిన చిత్ర బృందం పాల్గొంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజ‌రై హాజ‌రై క్లాప్ కొట్టారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రంతోనే రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మమిత బైజు క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com