ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..
- May 20, 2025
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ లో నిర్ణయించారు.పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
- సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు.
- కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయింపు.
- ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున భూ కేటాయింపునకు కేబినెట్ నిర్ణయం.
- 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి.
- అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ లో చర్చ జరిగింది.
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ అమోదం తెలిపింది.
- ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం.
- పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం.
- రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్‌లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం







