బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్‌ను గెలుచుకున్న యూఏఈ
- May 22, 2025
షార్జా: యూఏఈ టీమ్ చరిత్ర సృష్టించింది.బంగ్లాదేశ్ పై తొలిసారి టీ20 సిరీస్‌ను గెలిచింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది.బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తంజిద్ హసన్ (18 బంతుల్లో 40 పరుగులు), జాకర్ అలీ (34 బంతుల్లో 41 పరుగులు) లు రాణించారు.కెప్టెన్ లిటన్ దాస్ (14),తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) లు విఫలం అయ్యారు.
యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లు తీశాడు.సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్యాన్ని యూఏఈ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. యూఏఈ బ్యాటర్లలో అలిషాన్ షరాఫూ (68 నాటౌట్; 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.అతడితో పాటు ఆసిఫ్ ఖాన్ (41నాటౌట్; 26 బంతుల్లో 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొస్సేన్ తలా ఓ వికెట్ తీశారు.
దీంతో టీ20 సిరీస్‌ను యూఏఈ 2-1తో కైవసం చేసుకుంది.టెస్టు హోదా కలిగిన జట్టు ద్వైపాక్షిక సిరీస్ గెలడం యూఏఈకి ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







