పుష్కరాల్లో తొక్కిసలాట, 11మంది మృతి
- July 13, 2015
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలు తీవ్ర విషాదాన్ని రగిలించాయి. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్రగాయాల పాలైనట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. మృతులు విశాఖ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరికి చెందినవారి తెలుస్తోంది. గాయపడిన వారిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కాగా భక్తులను అదుపు చేయటంలో పోలీసులు విఫలమయ్యారు. కాగా, పుష్కర ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు పుష్కర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసామన్న ఫ్రీ బస్సుల జాడ లేదని విమర్శించారు. క్యూ లైన్ల వ్యవస్థ సరిగా లేదని తెలిపారు. కనీసం తాగడానికి మంచినీటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







