గంటగంటకూ పెరుగుతున్న మృతులు...
- July 13, 2015
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘట్ వద్ద మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. తొలుత ఒక్కరు, ఆపై ముగ్గురు.. ఆరుగురు.. అంటూ ఇలా మృతుల సంఖ్య ఏకంగా 24కు చేరుకుంది. అనధికారికంగా ఈ సంఖ్య 30కు చేరిందని సమాచారం. భారీగా భక్తులు తరలిరావడం, వారు తొందరపడి గోడదూకడాలు వంటి పనులు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాటు మొదలైంది. దీంతో భక్తుల మరణాలు గంటగంటకూ పెరిగిపోతున్నాయి. ఇదిలాఉండగా ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు చేపట్టలేదంటూ యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నప్పటికీ, మరోవైపు వీఐపీలకు సాఫీగా పుష్కర స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తుండటం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదని అంబులెన్స్ లు అందుబాటులో లేవని అరకొర ఏర్పాట్లపై భక్తులు మండిపడుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచడంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







