భారత్‌లో 20 లక్షల మందికి వెబ్‌ డెవలపర్లగా శిక్షణ ఇవ్వనున్న గూగుల్

- July 11, 2016 , by Maagulf
భారత్‌లో 20 లక్షల మందికి వెబ్‌ డెవలపర్లగా శిక్షణ ఇవ్వనున్న గూగుల్

ప్రముఖ సెర్చింజిన్‌ దిగ్గజ కంపెనీ గూగుల్‌ భారత్‌లో 20 లక్షల మందికి వెబ్‌ డెవలపర్లగా శిక్షణనివ్వనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ నైపుణ్యత, ధ్రువీకరణ ప్రోగ్రామ్‌ను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌పై సిలబస్‌ను రూపొందించి శిక్షణను అందుబాటులో వుంచనున్నట్లు ప్రొడెక్ట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కాసెర్‌ సేన్‌గుప్తా వెల్లడించారు.
స్కిల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా లక్షలాది మంది యువతకు చేరువచేయనున్నట్లు తెలిపారు. తద్వారా మొబైల్‌ యాప్‌ అభివృద్ధిలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ కోర్సును జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ వర్సిటీలన్నింటిలోనూ అందుబాటులో వుంచనున్నట్లు వివరించారు. ఈ నెల 18 నుంచి ఆండ్రాయిడ్‌ ప్రాథమికాంశాలకు సంబంధించిన కోర్సులను అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు.
గూగుల్‌ ఈ కోర్సును ఉడాసిటీ, ఎడ్యురేఖ, మణిపాల్‌ గ్లోబల్‌, సింప్లీలెర్న్‌, అప్‌గ్రేడ్‌ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని అన్ని వర్సిటీల్లో అందించేందుకు ముందుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com