సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'కబాలి'
- July 11, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం 152 నిమిషాల కాలం నడవనుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కబాలి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ రంజిత్ తెరకెక్కించారు. కలై ఫులి ఎస్ థాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకబాలి చిత్రం రిలీజ్ డేట్ ఇప్పటి వరకు చాలా సార్లు మారింది. అయితే...ఎట్టకేలకు కబాలి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
చెన్నై సమాచారం ప్రకారం కబాలి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ చేయనున్నారు. బుధవారం నుంచి కబాలి ప్రమోషన్స్ స్పీడు పెంచనున్నారు. కబాలి రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేస్తూ బుధవారం ప్రముఖ దినపత్రికల్లో రిలీజ్ డేట్ యాడ్ రానున్నట్టు సమాచారం. టీజర్ & ప్రమోషన్స్ లో సరికొత్త రికార్డ్స్ సాధించడంతో కబాలి చిత్రం పై ఇంతకు ముందు ఎన్నడూ లేనంత క్రేజ్ ఏర్పడింది. మరి...రజనీ కబాలి చిత్రంతో ఎలాంటి సంచలనం సృష్టించనున్నాడో ఈనెల 22న తెలుస్తుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







