మే నెలలో పెరిగిన పెట్రోల్ ధరలు జూన్‌లో తగ్గుతాయా?

- May 27, 2025 , by Maagulf
మే నెలలో పెరిగిన పెట్రోల్ ధరలు జూన్‌లో తగ్గుతాయా?

యూఏఈ: ఈ నెలాఖరులో ప్రకటించే జూన్ నెలకు సంబంధించి పెట్రోల్ ధరలలో స్వల్ప తగ్గింపు కనిపించవచ్చు. మే లో బ్రెంట్ చమురు ఎక్కువగా బ్యారెల్‌కు $60 దరిదాపుల్లో ట్రేడవుతోంది. ఇది గత నెల కంటే కొంచెం తక్కువ. తాజాగా WTI ముడి చమురు, బ్రెంట్ వరుసగా బ్యారెల్‌కు $61.44 మరియు $64.68 వద్ద స్వల్పంగా తగ్గాయి.
మే నెలలో లీటరుకు కేవలం ఒక ఫిల్సు చొప్పున ధరలను పెరిగాయి. సూపర్ 98, స్పెషల్ 95 మరియు E-ప్లస్ 91 ధరలను వరుసగా లీటరుకు Dh2.58, Dh2.47 మరియు Dh2.39గా నిర్ణయించారు. యూఏఈ లో 2015లో ఇంధన ధరలపై నియంత్రణ తొలగించినప్పటి నుండి ప్రతి నెలాఖరులో పెట్రోల్ ధరలను సవరిస్తున్నారు. 

జూన్ నెలలో బ్రెంట్ సగటు ముగింపు ధర బ్యారెల్‌కు $63.6గా ఉంది. గత నెలల బ్యారెల్‌కు $66.6గా ఉంది. అయితే, జూన్ నెలకు కొత్త ధరల గురించి అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో వెలువడుతుంది. ఇంధన ఉత్పత్తి సంస్థ ఒపెక్+ ఈ వారం జరిగే సమావేశంలో ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉన్నందున చమురు ధరలు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

"ఈ సంవత్సరం ముడి చమురు బాగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయి. డిమాండ్ నేపథ్యంలో ఒపెక్ + మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి ఉత్పత్తిని వేగవంతం చేయవచ్చు. చమురు ఈ సంవత్సరం $74.93 దగ్గర ప్రారంభమైంది. జనవరి మధ్య నాటికి $82.63కి పెరిగింది, కానీ ఏప్రిల్ 9 నాటికి $58.40కి పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా తిరిగి వచ్చింది, మే చివరి నాటికి ధరలు దాదాపు $65కి పెరిగాయి. కానీ అది ఇప్పటికీ చమురు దాని ప్రారంభ సంవత్సరం గరిష్ట స్థాయి కంటే దాదాపు 20 శాతం తక్కువగా ఉంది. ”అని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com