లేబర్ చట్టాల ఉల్లంఘన..కార్మికులు, యజమాని అరెస్ట్..!!

- May 30, 2025 , by Maagulf
లేబర్ చట్టాల ఉల్లంఘన..కార్మికులు, యజమాని అరెస్ట్..!!

మనామా: లేబర్ చట్టాలను ఉల్లంఘించి, తప్పించుకు తిరుగుతున్న డొమెస్టిక్ కార్మికులను, వారికి నిబంధనలను ఉల్లంఘించి ఉపాధిని కల్పించిన యజమానిని అరెస్ట్ చేసినట్లు జాతీయత, పాస్‌పోర్ట్‌లు నివాస వ్యవహారాలు (NPRA) తెలిపింది.  బహ్రెయిన్ నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించే కార్మికులకు సంబంధించిన పలు నివేదికల ఆధారంగా సమగ్ర దర్యాప్తు తర్వాత ఈ అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు.చట్టవిరుద్ధంగా వారిని నియమించిన థార్డ్ పార్టీ సహాయంతో వ్యక్తులు గంటవారీగా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  వారిపై తదుపరి దర్యాప్తు, న్యాయపరమైన చర్యల కోసం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com