మీడియా కంటెంట్ నియంత్రణ..యూఏఈలో ఏజ్ రేటింట్ సిస్టం అమలు..!!

- May 30, 2025 , by Maagulf
మీడియా కంటెంట్ నియంత్రణ..యూఏఈలో ఏజ్ రేటింట్ సిస్టం అమలు..!!

యూఏఈ: యూఏఈలో ఏజ్ రేటింట్ సిస్టం అమలు చేయనున్నారు. దీని ప్రకారం.. పిల్లలు, టీనెజర్స్ ను అనవసరమైన కంటెంట్ నుంచి రక్షించనుంది.  డిజిటల్ కంటెంట్ వినియోగం పెరుగుతున్నందున "సమగ్ర" వ్యవస్థ చాలా కీలకం అని యూఏఈ మీడియా కౌన్సిల్ తెలిపింది. అయితే, ఈ వ్యవస్థను ఎప్పుడు లేదా ఎలా అమలు చేస్తారో కౌన్సిల్ పేర్కొనలేదు.

ప్రస్తుతం యూఏఈలో సినిమాలు, వీడియో, ఎలక్ట్రానిక్ గేమ్‌లు, కామిక్స్, ప్రింటెడ్ పుస్తకాలు అలాగే ఇతర మెటీరియల్‌ల కోసం ఏజ్ రేటింట్ సిస్టంను కలిగి ఉంది. అనుచితమైన కంటెంట్ నుండి పిల్లలను రక్షించడమే లక్ష్యమని ఈ సందర్భంగా మీడియా కౌన్సిల్, స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీస్ సెక్టార్ సీఈఓ మైతా అల్ సువైది తెలిపారు.  40 సంవత్సరాలలో జారీ చేయబడిన మొదటి మీడియా చట్టంగా, ఇది భవిష్యత్తు-ప్రూఫ్ మీడియా ల్యాండ్‌స్కేప్‌కు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, ఆన్-డిమాండ్ బ్రాడ్‌కాస్టింగ్, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలో పురోగతిని పరిష్కరిస్తుందని యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ అల్ షెహి వెల్లడించారు. ఇలాంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం, ప్రేక్షకులను రక్షించడం, ఆన్‌లైన్ మీడియా కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంటుందన్నారు. పర్మిట్ ఫీజుల నుండి మూడు సంవత్సరాల మినహాయింపు ద్వారా కంటెంట్ సృష్టికర్తలకు ఇది ఖచ్చితమైన మద్దతును కూడా అందజేస్తుందని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com