కువైట్ లో ప్రవాస టీచర్లు, స్టాఫ్ తొలగింపు..!!
- May 30, 2025
కువైట్: కువైట్లో 34 సంవత్సరాల సేవను పూర్తి చేసిన 60 మంది ప్రవాస ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలకు విద్యా మంత్రిత్వ శాఖ ముగింపు పలికింది. ఉద్యోగాలను స్థానికీకరణ, కువైట్ జాతీయులకు మరిన్ని అవకాశాలను సృష్టించడం అనే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ పాఠశాలలో గరిష్ట చట్టపరమైన సేవా కాలాన్ని దాటిన నాన్ కువైటీల పూర్తి జాబితాను మంత్రిత్వ శాఖ పరిపాలనా విభాగం సిద్ధం చేసింది. ఇందులో ప్రాథమిక, మాధ్యమిక, మాధ్యమిక పాఠశాలల నుండి 55 మంది ఉపాధ్యాయులు , 5 మంది పరిపాలనా సిబ్బంది ఉన్నారు. ఈ తొలగింపు నిర్ణయం డిసెంబర్ 2025 నాటికి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అదే సమయంలో సివిల్ సర్వీస్ కమిషన్ నాన్ కువైట్ ఉపాధ్యాయుల నియామకానికి కొత్త దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







