ఓపెన్-ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్న పాత దోహా పోర్ట్..!!

- June 01, 2025 , by Maagulf
ఓపెన్-ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్న పాత దోహా పోర్ట్..!!

దోహా, ఖతార్: ఓడరేవు తీరం వెంబడి ఓపెన్-ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ను పాత దోహా పోర్ట్ ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్ట్ ఖతార్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఓడరేవు స్థానాన్ని పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు జూన్ లో ప్రారంభం కానున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖతార్ బోట్ షో 2025 కంటే ముందే పూర్తి కానున్నాయి. వచ్చే వేసవి కాలంలో ఆపరేషన్ ప్రారంభం కానుంది. ఈ వినూత్న శీతలీకరణ వ్యవస్థ మినా జిల్లా ప్రొమెనేడ్ అంతటా విస్తరించి, 530 లీనియర్ మీటర్ల మేర పెడస్ట్రేయిన్స్  మార్గాలు, రిటైల్ ఫ్రంటేజ్‌లు, అవుట్‌డోర్ డైనింగ్ టెర్రస్‌లను కలిగి ఉంటుంది. వేసవి నెలల్లో కూడా సందర్శకులకు ఏడాది పొడవునా సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపారు.

అత్యాధునిక భూగర్భ చల్లబడిన నీటి పైప్‌లైన్‌లను ఉపయోగించడం ద్వారా, ఈ వ్యవస్థ అత్యంత వేడిగా ఉండే నెలల్లో పరిసర, చల్లని ఉష్ణోగ్రతలను నిర్వహిస్తుంది.  ఇవన్నీ ఓడరేవు తీరప్రాంత సౌందర్యాన్ని కాపాడుతుందని తెలిపారు. ఈ మేరకు ట్రాగ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & ఎయిర్ కండిషనింగ్ కంపెనీ, ఓల్డ్ దోహా పోర్ట్ ప్రతినిధులు మినా హోటల్ అండ్ రెసిడెన్సెస్‌లో ఒప్పందపై సంతకాలు చేశారు.

“ఓల్డ్ దోహా పోర్ట్‌ను ఏడాది పొడవునా అభివృద్ధి చెందే గమ్యస్థానంగా మార్చాలనే మా ప్రయాణంలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయి.” అని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com