మహిళా సంఘాల కోసం కొత్త స్కీమ్లు: సీఎం రేవంత్
- June 02, 2025
హైదరాబాద్: తెలంగాణ వచ్చాక పదేళ్ల తర్వాత కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను తాము చక్కదిద్దుతున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలని తెలిపారు. మహిళా సంఘాలకు క్యూఆర్ కోడ్ కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకువస్తామని అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. సివిల్స్‌కి ఎంపికైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకు రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేశామని అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







