విజయోత్సవం హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మృతి
- June 02, 2025
పారిస్: ఫ్రాన్స్ లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది.ఈ ఘర్షణల్ల ఇద్దరు మృతి చెందగా, 192మంది గాయపడ్డారు.ఛాంపియన్స్ లీగ్లో పారిస్ సెయింట్-జర్మైన్-పీఎస్జీ ఫుట్బాల్ క్లబ్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.దీనితో వారి అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం
ఈ సందర్భంగా ప్రత్యర్థి జట్టు అభిమానులతో మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు వారు దుకాణాల దోపిడీలకూ పాల్పడినట్లు చెప్పారు. అసాంఘిక శక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. అల్లర్లకు బాధ్యులైన 559 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







