వైజాగ్ లో 'యాంటీ డ్రగ్ పార్క్'
- June 02, 2025
విశాఖపట్నం: విశాఖపట్నంలో సరికొత్త ఆవిష్కరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో “యాంటి డ్రగ్ పార్క్” ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.సెంట్రల్ పార్క్‌లోని రెండు ఎకరాల భూమిలో మూడు కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ పార్క్ నిర్మాణం జరగనుంది.డ్రగ్స్ దుర్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ పార్క్ ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పార్క్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు తెలియజేసి కౌన్సిలింగ్ కేంద్రాలు
ఈ పార్క్‌లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను యువతకు స్పష్టంగా తెలియజేసేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు బానిసలైనవారికి పునరావాస సదుపాయాలుగా కూడా ఈ పార్క్ పనిచేయనుంది. “పార్క్ ఆఫ్ లైఫ్” కాన్సెప్ట్‌తో డ్రగ్‌లేని జీవితం ఎంత అందంగా, శాంతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా చూపించబోతున్నారు. పచ్చదనం, విద్యుత్ కాంతుల మొక్కలు, రంగురంగుల చెట్లు, సీతాకోకచిలుకల మోడల్స్, వాటర్ ఫౌంటెన్స్ వంటి అంశాలు ఈ పార్క్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
సిటీ సెంట్రల్ పార్క్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించేలా మోటివేషన్
ఈ యాంటి డ్రగ్ పార్క్ యువతకు ఒక బలమైన సందేశాన్ని అందించడమే కాకుండా, విశాఖపట్నం నగరానికి మరో కొత్త ఆకర్షణగా మారనుంది.సిటీ సెంట్రల్ పార్క్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించేలా మోటివేషన్ కార్యక్రమాలు చేపడతామని విఎంఆర్డిఏ తెలిపింది.యువగళం పాదయాత్రలో ఈ ఆలోచనకు బీజం పడగా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని ప్రణవ్ గోపాల్ అన్నారు. వియత్నామ్ వంటి దేశాలలో మాదక ద్రవ్యాలపై ప్రజల చైతన్యానికి ఇటువంటి ప్రయత్నాలు ఎంతో ఫలప్రదంగా మారిన దృష్ట్యా, ఈ యాంటి డ్రగ్ పార్క్ కూడా మంచి మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







