మైనర్లకు ఈ-స్కూటర్లను ఇస్తున్నారా?

- June 02, 2025 , by Maagulf
మైనర్లకు ఈ-స్కూటర్లను ఇస్తున్నారా?

యూఏఈ: యూఏఈలో లైసెన్స్ లేకుండా ఎలక్ట్రిక్ బైక్‌లు, ఈ-స్కూటర్లను నడిపే టీనేజర్ల సంఖ్య పెరుగుతోంది. మైనర్లు రద్దీగా ఉండే రోడ్లు, ట్రాఫిక్ లేన్‌లలో తక్కువ లేదా అనుభవం లేకుండా, తరచూ ట్రాఫిక్ చట్టాలను విస్మరిస్తూ..తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా తిరుగుతున్నారు. దీనిపై యూఏఈ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూఏఈలో ఇ-స్కూటర్లు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి.  ఇప్పుడు జనరేషన్ ఆల్ఫాలో ఎలక్ట్రిక్ బైక్‌లు తాజా ట్రెండ్‌గా మారాయి. తల్లిదండ్రుల తెలిపిన ప్రకారం.. చాలా మంది పిల్లలు తమ ఈ బైక్‌లను బహుమతులుగా అభ్యర్థిస్తున్నారు.  చాలా మంది యువ రైడర్లు తమను తాము ప్రమాదంలో పడేయడమే కాకుండా డ్రైవర్లకు కూడా అంతరాయం కలిగించే నిర్లక్ష్య ప్రవర్తనను కలిగి ఉంటున్నారని పేర్కొన్నారు.  

దుబాయ్‌లోని అధికారులు తమ పిల్లలు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే తల్లిదండ్రులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. 'క్రైమ్ అండ్ లెసన్' సిరీస్‌లో భాగంగా.. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 13 ఏళ్ల బాలిక తన ఇ-స్కూటర్‌పై రోడ్డు దాటుతుండగా గాయపడిన కేసును హైలైట్ చేసింది. అకాడమిక్ లో చూపి మంచి పనితీరుకు మెచ్చి ఆమె తండ్రి ఆమెకు స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడని అనంతరం విచారణలో తేలింది. పేరెంట్స్ పై కేసు నమోదు చేసి కోర్టు ముందు నిలబెట్టారు.

2024లో దుబాయ్ 254 ఇ-స్కూటర్ ,  సైకిల్ సంబంధిత ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రమాదాల కారణంగా 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. 2025లో ఈ సమస్య మరింత తీవ్రమైంది.  ఫిబ్రవరిలో కేవలం మూడు రోజుల్లోనే రెండు ఇ-స్కూటర్ సంబంధిత మరణాలు సంభవించాయి.  15, 9 సంవత్సరాల వయస్సు గల మైనర్లు ప్రమాదంలో మరణించడం అందరిని కదిలిచింది.  

దుబాయ్ లో ఈ-స్కూటర్, ఇ-బైక్ వాడకంపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది.  ఇందులో కనీస రైడర్ వయస్సు 16 సంవత్సరాలుగా నిర్ణయించారు. పర్యవేక్షణకు అధికారులు ప్రత్యేక వ్యక్తిగత మొబిలిటీ మానిటరింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ట్రాఫిక్ భద్రతను మెరుగుపరిచారు. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం రైడర్లు నిర్దేశించిన లేన్‌లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. బ్యాలెన్స్ తప్పించే వస్తువులను రవాణా చేయవద్దు. ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రయాణించవద్దు. ఎల్లప్పుడూ హెల్మెట్‌లు,  తగిన రక్షణ గేర్‌లను ధరించాలి. పాదచారుల నడక మార్గాలతో సహా నిషేధిత ప్రాంతాలలో ప్రయాణించడం ఉల్లంఘనల కిందకు వస్తుంది. నిబంధనలు పాటించని వందలాది ఇ-స్కూటర్లు,  సైకిళ్లను ప్రతి నెలా స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com