యూఏఈ పర్యాటకులకు జపాన్ శుభవార్త..!!

- June 02, 2025 , by Maagulf
యూఏఈ పర్యాటకులకు జపాన్ శుభవార్త..!!

యూఏఈ: యూఏఈ పర్యాటకులకు జపాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వీసా లేకుండా 90 రోజుల పాటు నివసించవచ్చు. ఇది గతంలో 30 రోజులుగా ఉంది. ఈ నిర్ణయం జూలై 1 నుండి అమలు చేయబడుతుందని టోక్యోలోని యూఏఈ రాయబార కార్యాలయం ప్రకటించింది.

వీసా మినహాయింపు చర్యను పొందడానికి, అర్హత ప్రమాణాలు:

యూఏఈ జాతీయులు ICAO కంప్లైంట్ అయిన చెల్లుబాటు అయ్యే సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండాలి. ( IC పాస్‌పోర్ట్‌లు)

విజిట్ ఉద్దేశ్యంతోపాటు స్వల్పకాలిక రెసిడెన్సీ(సందర్శనా స్థలాలు, వ్యాపారం లేదా బంధువులు/స్నేహితుల సందర్శన కోసం)

నవంబర్ 2022 నుండి, యూఏఈ జాతీయులు జపాన్‌ను సందర్శించడానికి వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వీసా-రహిత ప్రవేశాన్ని పొందవచ్చు.

2024లో 90 రోజులకు మించని స్వల్పకాలిక బస కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న జపనీస్ జాతీయుల కోసం యూఏఈ వీసా మినహాయింపును ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com