Dh40 బిలియన్ విలువైన ఫాహిద్ ద్వీపం ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- June 02, 2025
యూఏఈ: అబుదాబి రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్ ఫాహిద్ ద్వీపం ప్రారంభమైంది. ఇది అల్దార్ ద్వారా కొత్త Dh40 బిలియన్ల మాస్టర్ప్లాన్డ్ తీరప్రాంత కమ్యూనిటీగా ప్రకటించారు. 2.7 మిలియన్ చదరపు మీటర్ల ద్వీపంలో 6,000 కంటే ఎక్కువ హై-ఎండ్ గృహాలు, 10 కి.మీ ఫిట్నెస్ కారిడార్, 4.6 కి.మీ బీచ్‌లు, ప్రత్యేక వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్ ఉంటాయి.
ఇది అబుదాబిలో మొట్టమొదటి తీరప్రాంత వెల్నెస్ ద్వీపంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఫిట్వెల్ సర్టిఫికేషన్ పొందింది. ఇది ప్రపంచ ఆరోగ్యకరమైన భవన ప్రమాణాలను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి ద్వీపంగా నిలిచింది.
యాస్, సాదియత్ దీవుల మధ్య ఉన్న ఫాహిద్ ద్వీపం.. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అబుదాబిలోని విశ్రాంతి, సాంస్కృతిక , విమానయాన కేంద్రాలకు కనెక్టివ్ గా ఉంటుంది. వీటి మధ్య ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలు అని అల్దార్ తెలిపింది. విదేశీ పెట్టుబడిదారుల నుండి అద్భుతమైన డిమాండ్ ఉందని అల్దార్ గ్రూప్ సీఈఓ తలాల్ అల్ ధియేబి తెలిపారు. అబుదాబిలో ప్రారంభించిన అతిపెద్ద మల్టీ యూజ్ వినియోగ నివాస మాస్టర్ప్లాన్లలో ఫాహిద్ ద్వీపం ఒకటి అని అన్నారు.
తాజా వార్తలు
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..
- బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!