రష్యాలో బ్రిడ్జి పేల్చేసిన యుక్రెయిన్

- June 03, 2025 , by Maagulf
రష్యాలో బ్రిడ్జి పేల్చేసిన యుక్రెయిన్

యుక్రెయిన్ తగ్గేదేలే అంటోంది. రష్యాకు ముచ్చెటమలు పట్టిస్తోంది. ప్రతీకార దాడులతో రష్యాను బెంబేలెత్తిస్తోంది.మొన్న డ్రోన్స్ తో రష్యాపై భీకర దాడులు చేసి హడలెత్తించిన యుక్రెయిన్ తాజాగా.. అండర్ వాటర్ బాంబ్స్ తో రష్యాలోని బ్రిడ్జిని పేల్చేసింది. రష్యాలో రైలు వంతెనను పేలుడు పదార్థాలతో పేల్చేసినట్లు యుక్రెయిన్ SBU సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. 1,100 కిలోగ్రాముల (2,420 పౌండ్లు) పేలుడు పదార్థాలను ఉపయోగించి వంతెనను పేల్చి వేసినట్లు తెలిపింది. ఆ వంతెన రష్యన్ దళాలకు కీలకమైన సరఫరా మార్గం అని వెల్లడించింది.

గతంలోనూ 2022, 2023లో రెండుసార్లు వంతెనపై దాడి చేసినట్లు యుక్రెయిన్ తెలిపింది. ఈ ఆపరేషన్ కోసం చాలా నెలలుగా సన్నాహాలు చేశామంది. వంతెన స్తంభాలలో ఒకదాని పక్కన పేలుడు జరిగినట్లు చూపించిన వీడియో ఫుటేజీని యుక్రెయిన్ షేర్ చేసింది. దీనిపై రష్యన్ సైనిక బ్లాగర్లు స్పందించారు. ఈ దాడి విజయవంతం కాలేదని చెప్పారు. సముద్ర డ్రోన్ ద్వారా ఇది జరిగిందన్నారు.

ఆదివారం రష్యా వైమానిక స్థావరాలు లక్ష్యంగా యుక్రెయిన్ దాడులు చేసింది. అణ్వస్త్ర సామర్థ్యం గల లాంగ్-రేంజ్ బాంబర్ విమానాలపై దాడికి “స్పైడర్స్ వెబ్” అనే కోడ్‌నేమ్‌లో డ్రోన్‌లను ప్రయోగించింది. కెర్చ్ జలసంధిపై ఉన్న 19 కిలోమీటర్ల పొడవైన క్రిమియా వంతెన.. రష్యా రవాణా నెట్‌వర్క్, క్రిమియన్ ద్వీపకల్పం మధ్య ఏకైక ప్రత్యక్ష లింక్. దీన్ని యుక్రెయిన్ నుండి స్వాధీనం చేసుకుంది.

ఈ వంతెన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఒక ప్రధాన ప్రాజెక్ట్. ఇదొక ప్రత్యేక రోడ్డు, రైల్వే లైన్ ను కలిగి ఉంది. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై దండయాత్ర సమయంలో రష్యన్ దళాలు ఈ వంతెనను ఉపయోగించాయి. దానిని దాటి క్రిమియాకు చేరుకుని అక్కడి నుండి యుక్రెయిన్‌లోని దక్షిణ ఖేర్సన్, ఆగ్నేయ జపోరిజ్జియా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com