ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం

- July 12, 2016 , by Maagulf
ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం

ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో 20 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. బారి నగర సమీపంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. అత్యవసర సేవల విభాగం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పలువురిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొన్ని రైళ్ల బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది బయటకు తీసుకొస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన ట్రాక్‌పై రోజూ 200 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఇతర రైళ్ల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా అదనంగా ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఘటనపై ఇటలీ ప్రధాని మాట్టెయో రేంజి విచారం వ్యక్తంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com