బీహార్లోని ముజఫర్‌పూర్‌లో సల్మాన్, అనుష్కలపై చీటింగ్‌ కేసు

- July 12, 2016 , by Maagulf
బీహార్లోని ముజఫర్‌పూర్‌లో సల్మాన్, అనుష్కలపై చీటింగ్‌ కేసు

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌, అనుష్క శర్మ, దర్శకుడు అలీజఫర్‌ అబ్బాస్‌పై బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ షబీర్‌ అలియాస్‌ షబీర్‌ బాబా 'సుల్తాన్‌' చిత్రం పూర్తయిన తర్వాత నటుడు సల్మాన్‌ఖాన్‌ తనకు రూ.20 కోట్లు రాయల్టీ చెల్లిస్తాననిహామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపిస్తూ ఈ నెల 8న చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
షబీర్‌ తన జీవిత కథను రాసి 2010 సంవత్సరంలో ముంబయిలో సల్మాన్‌కు ఇవ్వగా, సల్మాన్‌ ఈ చిత్రం పూర్తయిన తర్వాత షబీర్‌ బాబాకు రూ.20 కోట్లు చెల్లిస్తానని ప్రమాణం చేశారని షబీర్‌ తరఫు న్యాయవాది సుధీర్‌కుమార్‌ ఓజా వాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com