నీ ఈ ప్రాణం
- June 09, 2025
ఎక్కడెక్కడ ఏరూపంలో దాగివున్నావో ఏనాడు కానరావు అంతటా నేనేనన్నావు ఎత్తైన గగనాన మెరిసే తారకవా అభిసారికవా ఎక్కడ ఉన్నా అనునిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేవు...
ఎవేవో తలపుల్లో దర్శనమిచ్చేవు
ఏకవి కవనానికి సైతము అందని అక్షరానివా
ఎన్నో ఆశలు ఆశయాలతో అన్వేషించినా కానరావే
ఏదో తెలపాలని క్షణక్షణం తపన పడిన
ఏవో ఆశలతో ఏ సడి చేయక
ఎదుట లేకున్నా ఎప్పటికైనా నీ మనసున నేనేననిన...
ఏవో చెరగని గురుతులు మదిలో ముద్రించిన
ఎన్ని జన్మలకైనా నీ శ్వాసలో శ్వాసగా నిలవాలని
ఎన్నో మధురమైన జ్ఞాపకాలు సజీవమేనని
ఏది నీది ఏది నాది నాదో లోకం నీదో లోకం కాదనిన ...
ఎదురుచూపుల ఏకాంతంలో ఎంతకాలమైనా
ఎన్నో ఆశనిరాశలతో ఎన్ని పరీక్షలైనా
ఏ నిర్లిప్తత ఆవహించిన వేచి చూచే నీ ఈ ప్రాణం...
--యామిని కోళ్ళూరు
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్‌కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్‌బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







