TTD ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

- January 09, 2026 , by Maagulf
TTD ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చాలాకాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఎట్టకేలకు ఊపొచ్చింది. డిసెంబర్ 16న నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఉద్యోగ భర్తీ, సేవా నిబంధనల సవరణలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

టీటీడీలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా బర్డ్ ఆసుపత్రి, ఎస్వీ గోశాల, వైద్య విభాగం, అలాగే ఆలయ కైంకర్యాలకు సంబంధించిన విభాగాల్లో విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేలా ఈ సవరణలు తీసుకువచ్చారు.

ప్రభుత్వ అనుమతితో అమలులోకి రానున్న మార్పులు
పాలకమండలి ఆమోదించిన ఈ ప్రతిపాదనలను తుది అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే కొత్త సేవా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు నిలిచిపోయిన నియామక ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

ఈ పరిణామంతో టీటీడీలో ఉద్యోగాల(TTD Jobs) కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగోన్నతుల అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. మొత్తం మీద, టీటీడీ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com