పవన్, అజిత్ ల కాంబినేషన్లో సినిమా
- July 12, 2016
టాలీవుడ్ లో పవర్ ఫుల్ హీరో పవన్ కల్యాణ్ అయితే...కోలీవుడ్ లో క్రేజీ హీరో అజిత్. ఇద్దరూ ఒకే రేంజ్ లో ఉన్నారని చెప్పవచ్చు. అజిత్ చేసిన రెండు సినిమాలు తమిళంలో బిగ్ హిట్స్ కావడంతో ఆ పిక్చర్స్ రీమేక్స్ లో పవన్ యాక్ట్ చేయబోతున్నాడని ఆమధ్య ఓ టాక్ వచ్చింది. ఆ వార్తలు విన్న తర్వాత పవన్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీలయ్యారు. బట్ ఆ తర్వాత ఏ సమాచారం రాలేదు.రీమేక్స్ మాట అటుంచితే...అసలు ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూసి... పండగ చేసుకోవచ్చు కదా అని అభిమానులు ఆశిస్తున్నారు. బ్రిటన్ తెలుగు సంఘం 6వ వార్షికోత్సవాలకు లండన్ వెళ్లిన పవన్ కల్యాణ్ ను ఓ ఫ్యాన్ ఈ మేటర్ గురించే అడిగాడు. అందుకు పవన్ కల్యాణ్ కూడా పాజిటివ్ గానే స్పందించాడు. తను, అజిత్ కలిసి ఓ సినిమా చేయాలని ఇంతవరకూ ఎవరూ అడగలేదన్నాడు. అయితే పవన్ తన ఫ్యాన్స్ ను డిసపాయింట్ చేయదలుచుకోలేదు. మా ఇద్దరితో ఎవరైనా సినిమా తీస్తానని ముందుకు వస్తే తనకు అభ్యంతరం లేదని, అజిత్ తో కలిసి నటిస్తానని పవర్ స్టార్ అనడంతో అక్కడున్న వాళ్లంతా ఉత్సాహంతో పొంగిపోయారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఎవరైనా ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ కూడా ఆ ప్లాన్ చేయవచ్చనే అనిపిస్తోంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







