తెలంగాణ: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్..
- June 10, 2025
హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చింది.టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను 20 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుంది.ఈ కొత్త ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
- ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్ ధర నెలకు రూ.1,150 ఉండగా, దానిని రూ.1,400కు పెంచారు.
- మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,300 నుంచి రూ.1,600కి పెరిగింది.
- మెట్రో డీలక్స్ పాస్ రూ.1,450 నుంచి రూ.1,800కి పెరిగింది.
- గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్సుల పాస్ ధరలు కూడా పెరిగాయి.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్‌లో కూడా టికెట్ల ధరలను పెంచారు. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడంతో నగరవాసులపై భారం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది.దీని వల్ల ఆర్టీసీకి భారీగా నష్టాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
సంస్థ జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శలు వస్తున్నాయి. తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కార్మిక నేతలతో చర్చలు జరిపిన తర్వాత, వారు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







