విదేశాల్లో తెలుగువారు సాహిత్యంపై రచనలు చేయడం అభినందనీయం: వేణుగోపాలాచారి
- June 10, 2025
హైదరాబాద్: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు సాహిత్యంపై రచనలు చేయడం అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. సోమవారం రాత్రి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళాలలిత కళవేదికలో వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి స్వాతి జాంగా(సింగపూర్) రచించిన సిరితలపుల శతకం ఆవిష్కరణ సభ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం అధ్యక్షతన జరిగింది.శ్రీ పేరి నిర్వహణలో జరిగిన ఈ సభలో 'వంశీ ప్రవాస భారతీయ సాహితి పురస్కారంను స్వాతి జంగా కు అందించి గౌరవించారు.ఈ గ్రంథాన్ని సుప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ కె.వి.కృష్ణ కుమారి ఆవిష్కరించారు.ముఖ్య అతిదిగా హాజరైన డాక్టర్ వేణుగోపాలాచారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రసంగించారు.సిరితలపుల శతకం పుస్తకంలో పద్యాలన్ని చదవదగినవన్నారు.సామాన్యులు, సహజశైలిలో అందరికి అర్ధమయ్యే విధంగా రచనలు చేయడం, స్వాతి జంగా వెలుగులోకి తీసుకురావాడం అభినందనీయమన్నారు.సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ ప్రపంచంలో యాభైకి పైగా దేశాల్లో ఉన్న తెలుగువారికి వంశీ రామరాజు పేరు తెలియనివారుండని, అటువంటి సాంస్కృతిక సాహిత్య నిత్యకృషీవలుడు అని అన్నారు.వంశీ లాంటి సంస్థను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు అక్కడున్న సాహిత్యం, నృత్యం,లలితకళలలన్నింటిని సమాహారం చేసి వారిని సత్కరించి అభినందించడం విశేషమన్నారు.ప్రపంచ దేశాలకు, భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా వంశీరామరాజు నిలుస్తారన్నారు.మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న తరుణంలో సాహిత్యకార్యక్రమాలు నిర్వహించడం విశేషమని అన్నారు.కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె.వి.కృష్ణ కుమారి, వాణి ఉప్పల(కెనడా), వంశీ సంస్థల అధినేత, కళా బ్రహ్మ డాక్టర్ వంశీ రామ రాజు,అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయకుడు వై.ఎస్ రామకృష్ణ నిర్వహణలో జరిగిన సినీ సంగీత విభావరి అందరిని అలరించింది.వ్యాఖ్యాతగా సుధామయి నిర్వహించగా శ్రీపేరి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







