పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు: ఎంపీ కొనకళ్ల

- July 12, 2016 , by Maagulf
పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు: ఎంపీ కొనకళ్ల

అమరావతిలో రైతులకు ఇచ్చిన విధంగానే పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు ఉంటాయని ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం 14వేల ఎకరాలు మాత్రమే సేకరించాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు తెలిపారు. పోర్టు నిర్మాణం ద్వారా పరిశ్రమలు వస్తాయని, ఉపాధి పెరుగుతుందన్నారు. పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుని అభివృద్ధి జరుగకుండా వైసీపీ, ఇతర పార్టీలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లలో చేయలేనిది...సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వైఎస్ హాయంలో అనేక లక్షల భూములు చేతులు మారాయని ఎంపీ కొనకళ్ల ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com