రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్పారు..
- July 13, 2016
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ సంక్షోభం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.ఈ తీర్పు తర్వాత ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో సంక్షోభం వీడి తిరిగి కాంగ్రెస్ చేతికే పాలన పగ్గాలు వచ్చాయి. ఈ తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు.'ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రధాని నరేంద్రమోదీకి వివరించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదములు' అని ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీర్పునుంచి మోదీ పాఠం నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







