నా నాన్న
- June 15, 2025
అనుక్షణం నీడలా కాచేవాడు అంబారీలా మోసే ఏనుగతడు అవసరాలు తీర్చే నిరాడంబరుడు అన్నింటా చేయూతనిచ్చే మహానీయుడు అతని స్వంత అవసరాలని పట్టించుకోడు .....
అణువణువునా నిక్షిప్తమైన మార్గదర్శకుడు
అనుభవాలని ఎన్నింటినో ఔపాసన పట్టిన
అనంతమైన వ్యక్తం చేయలేని ప్రేమని నింపుకొన్న
అన్ని బాధలు గరళాన దాచుకున్న
అమృతాన్ని పంచేటి భోళాశంకరుడు....
అల్లరి ఎంతచేసిన భరించే శూరుడు
అనుభవాలు పాఠాలుగా చెప్పే బోధకుడు
అందరి అవసరాలు తీర్చే త్యాగధనుడు
అన్ని వేళలా మనమున కాపుకాచే రక్షకుడు
అరవై యేండ్లు వచ్చిన పట్టువదలని విక్రమార్కుడు...
తనకంటూ జీవితాన్ని మర్చిపోయి
తన బిడ్డల భవిష్యత్తుకై కష్టపడుతూ
అర్ధం కాడు ఏనాటికీ ఎన్నటికి
ఆటంకాలు ఎన్నో ఎదుర్కొనే ధీరుడు
అన్ని వున్న ఎప్పుడూ ఒంటరివాడే నా నాన్న
--యామిని కోళ్ళూరు✍️
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!