జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!

- October 16, 2025 , by Maagulf
జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!

యూఏఈ: అబుదాబిలోని సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం కానుంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ మ్యూజియం వారు యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ గౌరవార్థం దీనిని నిర్మించారు.   

డిసెంబర్ 3 నుండి టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. పెద్దలకు Dh70 ధర నిర్ణయించగా.. మైనర్లు, సీనియర్ ఎమిరేట్లు మరియు నివాసితులు, దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులు, జర్నలిస్టులు ఉచితంగా ప్రవేశించవచ్చు. ఇక యూఏఈ యూనివర్సిటీల నుండి విద్యార్థులు మరియు ఎమిరేట్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు Dh35 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గంటసేపు సమయ స్లాట్‌ల ప్రకారం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. చివరి స్లాట్ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

ప్రిట్జ్‌ కర్ బహుమతి గ్రహీత ఆర్కిటెక్ట్ లార్డ్ నార్మన్ ఫోస్టర్ ఆఫ్ ఫోస్టర్, వారి పార్టనర్స్ రూపొందించిన ఈ మ్యూజియం డిజైన్ యూఏఈ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. జాయెద్ నేషనల్ మ్యూజియం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి మిమ్మల్ని తీసుకెళుతుంది. అల్ ఐన్‌లోని జెబెల్ హఫీత్‌లో కనుగొన్న 3లక్షల సంవత్సరాల పురాతన రాతి కాలానికి మిమ్మల్ని తీసుకెళుతుంది. ప్రదర్శనలో ఉన్న వస్తువులు పురాతన గతాన్ని ఈ ప్రాంత ప్రజల లోతైన సంప్రదాయాలతో పరిచయం చేస్తాయి. వీటితోపాటు దివంగత వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జీవితాన్ని వివరిస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com