శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

- October 16, 2025 , by Maagulf
శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో DRI అధికారులు మరోసారి చాకచక్యంగా బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కువైట్‌ నుంచి షార్జా మార్గం ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 1.8 కిలోల బంగారం దొరికింది. బంగారం మొత్తం 7 కడ్డీల రూపంలో ఉండగా, మార్కెట్ విలువ సుమారు ₹2.37 కోట్లు అని అధికారులు తెలిపారు.నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.

ఇటీవలి నెలల్లో బంగారం ధరలు లక్షా 30 వేల రూపాయల వరకు పెరగడంతో, అక్రమ రవాణా ఘటనలు మరింత పెరిగాయి. చోరీలు, చైన్‌స్నాచింగ్‌లతో పాటు అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో DRI అధికారులు విమానాశ్రయాల్లో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com