రాధిక తుమ్మల‌కు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం

- October 16, 2025 , by Maagulf
రాధిక తుమ్మల‌కు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం

హైదరాబాద్‌: డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 94వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాధిక తుమ్మలకి లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేయబడింది.

ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీ అందజేశారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను నూరిపోస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారం రాధిక తుమ్మలకి లభించింది.

కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.డా.కలామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని యువతకు ప్రేరణగా నిలవాలని రాధిక తుమ్మల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com