సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్ విడుదల
- June 16, 2025
తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల వేంకటేశ్వరస్వామి వివిధ దర్శనాలు, గదుల కోటా షెడ్యూల్ వివరాలను టీటీడీ సోమవారం విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నామని వెల్లడించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20న ఉయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వివరించారు.
ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని తెలిపారు. ఈనెల 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు , వర్చువల్ సేవల కోటాను, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వివరించారు.
23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను, ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నామని వివరించారు .
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామన్నారు. పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.inవెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







