దుబాయ్: ఘనంగా తొలి ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమ్మిట్
- June 16, 2025
దుబాయ్: రాయల్ ఐకాన్ ఈవెంట్స్ LLC మరియు స్పార్క్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన మొదటి ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమ్మిట్ జూన్ 15న దుబాయ్ అల్ జదాఫ్ ప్రాంతంలోని మారియట్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సమ్మిట్ లో యూఏఈ వ్యాప్తంగా ఉన్న తెలుగు వ్యాపారవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాపార అభివృద్ధిపై చర్చలు, నెట్‌వర్కింగ్ సెషన్లు, అనుభవాల పంచిక వంటి అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ డాక్టర్ బి.లక్ష్మి కాంతం నాయుడు మరియు ప్రముఖ ప్రేరణాత్మక ఉపన్యాసకులు గంపా నాగేశ్వరరావు హాజరై తమ అమూల్యమైన మాటలతో సభను అలరించారు.
ఈ సమ్మిట్ ద్వారా తెలుగు వ్యాపార వేత్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, భవిష్యత్తులో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.ఈ బిజినెస్ సమ్మిట్ ని విజయవంతం చేసిన స్పాన్సర్స్, మీడియా పార్ట్నర్,ప్రొడక్షన్ టీంకు అరుణ్ కుమార్ సుర్నిదా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ బిజినెస్ సమ్మిట్ లో 150 మందికి పైగా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!