యూఏఈలో సమ్మర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

- June 17, 2025 , by Maagulf
యూఏఈలో సమ్మర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

యూఏఈః యూఏఈలో చలికాలం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం దశాబ్దంలో అత్యంత వేడిగా ఉండే ఏప్రిల్‌లలో ఒకటిగా నమోదైందని, వర్షపాతం తగ్గిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకారం.. జూన్ 21 యూఏఈలో సమ్మర్ ప్రారంభం అవుతుందని, సూర్యుడు ఆకాశంలో ఎత్తైన, ఉత్తరాన ఉన్న బిందువుకు చేరుకుంటాడని  DAGలో ఆపరేషన్స్ మేనేజర్ ఖాదీజా అల్ హరిరి అన్నారు.  
యూఏఈలో సమ్మర్ సీజన్ జూన్ 21న ఉదయం 06.42 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 23న వరకు మూడు నెలల పాటు కొనసాగుతుంది.జూన్ 18, 24 మధ్య యూఏఈ తన పొడవైన పగటి సమయాన్ని కలిగి ఉంటుంది. పగటి వెలుతురు 13 గంటల 43 నిమిషాల వరకు ఉంటుందని  నిపుణుడు ఇబ్రహీం అల్ జర్వాన్ అన్నారు.
జూన్ 21 నుండి ఆగస్టు 10 వరకు విస్తరించి ఉన్నసమ్మర్ మొదటి అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సగటున పగటిపూట 41 నుండి 43°C వరకు.. రాత్రి సమయంలో 6–29°C వరకు ఉంటాయి. సమ్మర్ రెండవ భాగం ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 23 వరకు ఉంటుంది. ఈ సమయంలో తేమ అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని అల్ జర్వాన్ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com