GCC టూరిస్ట్ వీసాకు త్వరలో ఆమోదం..!!

- June 17, 2025 , by Maagulf
GCC టూరిస్ట్ వీసాకు త్వరలో ఆమోదం..!!

యూఏఈః GCC సింగిల్ టూరిస్ట్ వీసాకు ఆమోదం లభించిందని, త్వరలో అమలు చేయబడుతుందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి అన్నారు. యూఏఈ హాస్పిటాలిటీ సమ్మర్ క్యాంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా స్కెంజెన్ టూరిస్ట్ వీసా మాదిరిగానే ఈ ప్రాంతానికి ఏకీకృత టూరిస్ట్ వీసా లేదా GCC గ్రాండ్ టూర్స్ వీసాను విడుదల చేయడం గురించి చర్చిస్తున్నాయి. ఈ వీసా ద్వారా విదేశీ పర్యాటకులు ఆరు సభ్య దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ , కువైట్‌లను ఒకే వీసాపై సందర్శించవచ్చు.
ఏకీకృత వీసా ప్రాంతీయ పర్యాటక రంగం, మొత్తం ఆర్థిక వ్యవస్థలకు గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని, GDPకి పెద్ద ప్రోత్సాహంతో పాటు ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏకీకృత GCC పర్యాటక వీసా ఈ ప్రాంతంలో 'బ్లీజర్' (బిజినెస్) ప్రయాణాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.  
గల్ఫ్‌లోని అరబ్ దేశాల సహకార మండలి కోసం గణాంక కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం..ఈ ప్రాంతం 2023లో 68.1 మిలియన్ల సందర్శకులను స్వాగతించింది. పర్యాటక ఆదాయంలో రికార్డు స్థాయిలో $110.4 బిలియన్లను ఆర్జించింది. ఇది 2019లో మహమ్మారికి ముందు స్థాయిలతో పోలిస్తే పర్యాటకుల రాకపోకలలో 42.8 శాతం పెరుగుదల కావడం గమనార్హం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com