ఇజ్రాయెల్- ఇరాన్ వార్: సిట్యుయేషన్ రూమ్‌ను సందర్శించిన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్..!!
- June 17, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఈరోజు ప్రధానమంత్రి కార్యాలయంలోని సిట్యుయేషన్ రూమ్‌ను సందర్శించారు. ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ సన్నాహాలను హిజ్ రాయల్ హైనెస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్ రాయల్ హైనెస్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో బహ్రెయిన్ దౌత్య మార్గాల ద్వారా సంక్షోభాలను పరిష్కరించే విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తన పర్యటన సందర్భంగా సిట్యుయేషన్ రూమ్ కీలక బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో అసాధారణ నైపుణ్యం, అంకితభావాన్ని చూపిన సిబ్బందిని రాయల్ హైనెస్ అభినిందించారు. బహ్రెయిన్ ప్రజలు అసాధారణ పరిస్థితులను కూడా అభివృద్ధి, స్థిరమైన విజయానికి ప్రేరణగా మార్చుకుంటూనే ఉన్నారని ఆయన రాయల్ హైనెస్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!