మనామాలో పార్కింగ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌ మేజర్‌ ప్లాన్స్‌

- July 13, 2016 , by Maagulf
మనామాలో పార్కింగ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌ మేజర్‌ ప్లాన్స్‌

మనామా సౌక్‌, అల్‌గుఫోల్‌ ప్రాంతాల్లో పెద్దయెత్తున ల్యాండ్‌ స్కేపింగ్‌ మరియు పార్కింగ్‌ లాట్స్‌ ఏర్పాటు చేసి, పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని భావిస్తున్నారు. వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్టర్‌ ఎస్సామ్‌ ఖలీప్‌, ఎంపీ అహ్మద్‌ అబ్దుల్‌ వాహిద్‌ కరాటా, మునిసిపల్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నబీల్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ పతా, క్యాపిటల్‌ గవర్నరేట్‌ జనరల్‌ డైరెక్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా, అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఫర్‌ రోడ్స్‌ హుడా ఫక్రో మరియు పలువురు మినిస్ట్రీ అధికారులు సమావేశమై పలు ఆలోచనలు చేశారు. ఇమామ్‌ అల్‌ హుస్సేన్‌ స్ట్రీట్‌లో శానిటరీ ఇంజనీరింగ్‌ మరియు మెయింటెనెన్స్‌ ఎఫైర్స్‌ డైరెక్టరేట్‌ రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ పనుల్ని చేపట్టినట్లు ఖలాఫ్‌ చెప్పారు. క్యాపిటల్‌ గవర్నరేట్‌లోని రెండో కన్‌స్టిట్యూయెన్సీలో తరచూ తనిఖీలు నిర్వహించి, ప్రజల అవసరాలకు తగ్గట్గుఆ సౌకర్యాల్ని కల్పించాలని మినిస్టర్‌ అధికారులకు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com