పానిక్ కాకండి..400 మంది ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ: కువైట్

- June 19, 2025 , by Maagulf
పానిక్ కాకండి..400 మంది ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ: కువైట్

కువైట్: మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్  ముందస్తు అత్యవసర సంసిద్ధత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కువైట్ అంతటా అవసరమైన ఆహార వస్తువుల లభ్యతను, మార్కెట్ నియంత్రణ చొరవను ప్రారంభించింది. మార్కెట్లలో ఉన్న ఫీల్డ్ మానిటర్లకు రోజువారీ రిపోర్టింగ్ విధులను అప్పగించారు. 

ప్రణాళిక ప్రకారం, అన్ని గవర్నరేట్లలోని సహకార సంఘాలు, కేంద్ర మార్కెట్లను కవర్ చేస్తూ 400 మందికి పైగా వాణిజ్య ఇన్స్పెక్టర్లు ప్రతిరోజూ ఉదయం - సాయంత్రం రెండు షిఫ్టులలో పనిచేయనున్నారు. అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా వారు చర్యలు తసుకోనున్నారు. అలాగే నియోగదారుల డిమాండ్‌లో పెరుగుదల ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.  అదే సమయంలో ఫీల్డ్ మానిటర్లు ఉన్నతాధికారులకు ఖచ్చితమైన రోజువారీ నివేదికలను సమర్పించేలా ఆదేశాలు జారీ చేశారు. సరఫరా గొలుసును ఎండ్-టు-ఎండ్ పర్యవేక్షించడానికి సహకార సంఘాల యూనియన్ ,  కువైట్ ఫ్లోర్ మిల్స్ , బేకరీస్ కంపెనీతో సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. పౌరులు, నివాసితులు భయాందోళనలకు గురికాకుండా తమ కొనుగోళ్లను యధాతథంగా కొనసాగించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com