స్మార్ట్ వెదర్ పోర్టల్ ప్రారంభం
- July 13, 2016
దుబాయ్ మెరిటైమ్ సిటీ అథారిటీ, స్మార్ట్ వెదర్ అనే మొబైల్ ఫ్రెండ్లీ ఆన్లైన్ పోర్టల్‌ని ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని, అలాగే పౌరులకు పలు సూచనలు, సలహాల్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. డిఎంసిఎ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మహమౌద్ ఎవిదా మాట్లాడుతూ, వాతావరణంపై ఎప్పటికప్పుడు పౌరులకు సమాచారం అందించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ పోర్టల్ తయారు చేసినట్లు చెప్పారు. ఆఫ్ షోర్ మరియు ఆన్ షోర్ వెదర్ స్టేటస్‌ని, అలాగే ముందస్తు వాతావరణ హెచ్చరికల్ని, సమాచారాన్ని అందజేస్తుందని, తొమ్మిది రోజుల ముందుగా ఈ సమాచారాన్ని అందించగలిగేలా వెబ్ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశామని తెలిపారాయన. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశాల్నీ, సాధారణ స్థితిని కూడా ఈ వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రొఫెషనల్ అలాగే పబ్లిక్ వెర్షన్లలో ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







