హైదరాబాద్: టోలిచౌకిలో 28మంది అక్రమ విదేశీయుల గుర్తింపు
- June 20, 2025
హైదరాబాద్: టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నేడు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నైజీరియన్లు సోమాలియన్లు కారణంగా పారామౌంట్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తుండడంతో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 300ఇండ్లను పోలీసులు తనిఖీలు చేశారు. 28 మంది విదేశీయుల వద్ద సరైన పత్రాలు లేవని,16 మంది వీసా కాలం పూర్తయినట్లు గుర్తించామని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. పత్రాలు సరిగా లేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్రమంగా ఉంటున్న విదేశీయుల కు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ అధికారులకు పంపిస్తామని, దీనికి సంబంధించి వారే నిర్ణయం తీసుకుంటారని డీసీపీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా పోలీసింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాగా, సుమారు 250 మంది పోలీసులతో పాటు డీసీపీ చంద్రమోహన్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధికి, ఏసీపీలు సుదర్శన్, సయ్యద్ ఫయాజ్, విజయ్ శ్రీనివాస్, మమ్మద్ మునావర్ తో పాటు 15 మంది ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్సైలు, సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







