క్రీడాకారుల కోసం నాణ్యమైన వస్తువులు ...
- July 13, 2016
జీవితంలో క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని అలాంటి క్రికెట్ కోసం ఎంతో కొంత తిరిగిచ్చేయాలనుకుంటున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్టాస్టర్ సచిన్ తెలిపాడు. వ్యాపారవేత్తగా మారిన సచిన్ క్రీడా వస్తువులను తయారు చేసే సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం నాణ్యమైన వస్తువులను తయారుచేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న 'స్పార్టాన్ ఇంటర్నేషనల్'లో భాగస్వామి కావడంతోపాటు బోర్డులో సలహాదారుడిగా కూడా చేరాడు. హెల్మెట్స్, గ్లోవ్స్, లెగ్ గార్డ్స్‌ల తయారీలో సచిన్ తన నైపుణ్యాలను సంస్థతో పంచుకోనున్నాడు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను ఈ విధంగా ప్రారంభించినప్పటికీ.. దీన్ని వ్యాపార కోణంలో చూడాలనుకోవట్లేదని.. భవిష్యత్ క్రికెటర్లకు తనవంతు సాయంగా మెరుగైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నానని సచిన్ పేర్కొన్నాడు.
మైదానంలో ఆటగాళ్ల వ్యక్తిగత భద్రత అతిముఖ్యమైన అంశం. అందుకే రక్షణ కల్పించే వస్తువులపైనే తాము ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు సచిన్ తెలిపాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న చాలా సందర్భాల్లో తన చేతివేళ్లు విరిగాయని అలాంటివి జరగకుండా గ్లోవ్స్ తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఈ సందర్భంగా పంచుకున్నాడు. మరోవైపు సచిన్ మార్క్ కనబడే కొత్తశ్రేణి ఉత్పత్తులు అక్టోబర్ 1 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







