మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై అరబ్ విదేశాంగ మంత్రులు ఆందోళన..!!

- June 21, 2025 , by Maagulf
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై అరబ్ విదేశాంగ మంత్రులు ఆందోళన..!!

అంకారా: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలతోపాటు ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం తీవ్రం కావడంపై అరబ్ విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. టర్కియేలోని ఇస్తాంబుల్‌లో  అరబ్ విదేశాంగ మంత్రుల అత్యవసర సమావేశం సందర్భంగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని టర్కిష్ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ తెలిపారు.    

గత శుక్రవారం నుండి ఇజ్రాయెల్..ఇరాన్ అణు సౌకర్యాలు, క్షిపణి స్థావరాలపై వైమానిక దాడులను చేస్తుంది. సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌పై దురాక్రమణను ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడులకు టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణులు,  డ్రోన్‌లను ప్రయోగించడం ద్వారా ప్రతిస్పందించింది. ఈ దాడులు ఉధృతి పెరగుతుందని, ప్రపంచ దేశాలు శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు చొరవ చూపాలని ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com