మొబైల్ కనెక్షన్ ఇ-ఆధార్‌తో ..
- July 13, 2016
కొత్తగా మొబైల్ కనెక్షన్ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన పనిలేదు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి లబించే ఇ-ఆధార్ లేఖ/డౌన్లోడ్ చేసుకున్న కార్డునే మొబైల్ కనెక్షన్ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణకు వినియోగించవచ్చని టెలికాం విభాగం స్పష్టం చేసింది. ఇ-ఆధార్ లేఖలో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని, వాటిని సిమ్‌కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని, సిమ్‌కార్డు విక్రయదారు వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది. మొబైల్ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాధ్యూస్, ఆస్పి సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ టెలికాం విభాగానికి వినతిపత్రం అందించారు. 'ఆధార్ కార్డుకు, యూఐడీఏఐ వెబ్సైట్ ఇ-ఆధార్ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్ కనెక్షన్‌కు రెండింటినీ అనుమతించాలని' వారు కోరారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం వీరికి ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







