3 BHK హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్
- June 28, 2025
హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
ఇల్లు సొంతం చేసుకోవాలనే జీవితకాల కల కలిగిన మధ్యతరగతి కుటుంబ భావోద్వేగ ప్రయాణంలో ఈ ట్రైలర్ మనసుని హత్తుకుంది. జీవితంలో వైఫల్యాలు, నిరాశలను ఎదుర్కొన్న తండ్రి, కుటుంబం ఆకాంక్షలను నెరవేర్చడానికి తన కొడుకుపై తన ఆశలన్నింటినీ ఉంచుతాడు. అయితే, చదువు పరంగా కష్టపడుతూ, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ 34 సంవత్సరాల వయస్సులో కూడా ఉద్యోగం లేకుండా ఉన్న కొడుకు భావోద్వేగ ప్రయాణం చాలా ఎమోషనల్ గా వుంది. ఆ కుటుంబం కల చివరకు సాకారం అవుతుందా లేదా అనేది చాలా ఆసక్తిని పెంచింది.
ఇల్లు కొనడం అనేది మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కథ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంది. దర్శకుడు శ్రీ గణేష్ భావోద్వేగపరంగా హృదయాన్ని తాకే కథనంతో తన మ్యాజిక్ ని ప్రజెంట్ చేశాడు.
సిద్ధార్థ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. తన కుటుంబం ఆనందం, భద్రత గురించి మాత్రమే కలలు కనే ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రను శరత్ కుమార్ చాలా చక్కగా పోషించారు. కథకు భావోద్వేగాన్ని జోడించే ఆకట్టుకునే నటనతో దేవయాని, మీతా రఘునాథ్ , చైత్ర ఆకట్టుకున్నారు.
సినిమాటోగ్రాఫర్లు దినేష్ కృష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్ విజువల్స్ మధ్యతరగతి జీవితాన్ని అందంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్ నేచురల్ గా వుంది. అమృత్ రామ్‌నాథ్ నేపథ్య సంగీతం ఎమోషన్ ని మరింత పెంచుతుంది. నిర్మాణ విలువలు టాప్ క్యాలిటీలో వున్నాయి.
గణేష్ శివ రాసిన స్క్రీన్ ప్లే, రాకేందు మౌళి సంభాషణలు అద్భుతంగా వున్నాయి. వినోద్ రాజ్ కుమార్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్. సిబి మారప్పన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.
ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత: అరుణ్ విశ్వ
ఫోటోగ్రఫీ డైరెక్టర్: దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేష్ శివ
డైలాగ్స్: రాకేందు మౌళి
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్ కుమార్ ఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: ఆర్. సిబి మారప్పన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







