'జిగ్రీస్' క్రేజీ ఫస్ట్ లుక్
- June 29, 2025
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి “జిగ్రీస్” అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు.
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జిగ్రీస్ టైటిల్, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక వింటేజ్ మారుతీ 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఇంట్రస్టింగ్‌గా ఉంది. బోల్డ్ ఆరెంజ్ బ్యాక్‌డ్రాప్, గ్రిట్టీ టైటిల్ టైపోగ్రఫీ... సినిమా ఎంత అడ్వెంచరస్‌గా ఉండబోతోందో తెలియజేస్తోంది.
ఈ ఫస్ట్ లుక్, టైటిల్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది.
జిగ్రీస్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈశ్వరాదిత్య డీవోపీ, కమ్రాన్ మ్యూజిక్, చాణక్య రెడ్డి ఎడిటర్.
త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ తెలియజేస్తారు.
నటీనటులు: కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: హరిష్ రెడ్డి ఉప్పుల
నిర్మాత: కృష్ణ వోడపల్లి
డీవోపీ: ఈశ్వరాదిత్య
ఎడిటర్: చాణక్య రెడ్డి
సంగీతం: కమ్రాన్
సౌండ్ డిజైన్: వి. స్వాప్నిక్ రావు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







